Tuesday, January 27, 2009

1.దూసుకుపో మిత్రమా!!

జీవితంలో ఆటుపోట్లు తప్పవు కదా మిత్రమా!,

చిన్న చిన్న బాధలకే శోకించుట న్యాయమా!,

కాలమంత ఒక్కరీతిగా ఉండుటమరి ధర్మమా!,

తట్టుకుని ముందుకెళ్ళి సాధించుట కష్టమా!,

అందుకే,

నిన్ను నీవు తెలుసుకుని,

నీ పరిధిలో నీవుండి,

ఉత్సాహం పెంచుకుని,

వివేకాన్ని వాడుకుని,

నింగికెగసె కెఱటంలా,

పరుగు పెట్టె తురగంలా,

సానబట్టె వజ్రంలా,
శోధించీ ,

సాధించీ,

నీ సత్తా చూపాలి,

నీ గమ్యం చేరాలి,

నీవేంటో చాటాలి…

0 comments: